సదర్మాట్‌ సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

సదర్మాట్‌ సిద్ధం!

Jan 13 2026 6:17 AM | Updated on Jan 13 2026 6:17 AM

సదర్మ

సదర్మాట్‌ సిద్ధం!

మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

16న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తిచేస్తున్న అధికారులు

సదర్మాట్‌ బ్యారేజీ నుంచి పాత ఆనకట్ట ఆయకట్టుకోసం ప్రత్యేకంగా కాలువ నిర్మించాలి.

సదర్మాట్‌ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌లో లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలి.

గతంలో ప్రకటించిన పొన్కల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలి.

స్థానిక నాగదేవత పేరును సదర్మాట్‌ బ్యారేజీకి పెట్టాలి.

నిర్మల్‌

సీఎం పర్యటన

విజయవంతం చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌/మామడ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 16న చేపట్టే నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పర్యటనను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌, కాంగ్రెస్‌ జిల్లా ఇన్‌చార్జి తాహెర్‌ బిన్‌ హమ్దాని అన్నారు. మామడ మండలం పొన్కల్‌ సదర్మాట్‌ బ్యారేజీని, జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో సీఎం సభ కోసం స్థలాన్ని నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం పరిశీలించారు. మొదట సదర్మాట్‌ బ్యారేజ్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇందులో జిల్లా ఇన్‌చార్జిలు చంద్రశేఖర్‌గౌడ్‌, రామ్‌భూపాల్‌, మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమన్‌ అలీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.

నిర్మల్‌: జిల్లాను మరింత సస్యశ్యామలం చేసే దిశగా మరో అడుగు పడుతోంది. దాదాపు పదేళ్లపాటు గోదావరినదిపై మామడ మండలం పొన్కల్‌ వద్ద నిర్మాణం కొనసాగిన సదర్మాట్‌ బ్యారేజీ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 16న బ్యారేజీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. అనంతరం నిర్మల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. బ్యారేజీ ప్రారంభం, పబ్లిక్‌ మీటింగ్‌ రెండు కార్యక్రమాలూ ఉండడంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంగ్రెస్‌ నాయకులూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వైఎస్సార్‌ ప్రతిపాదన..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్‌.రాజశేఖరరెడ్డి వేసిన తొలిఅడుగు ఇప్పుడు తు దిదశకు చేరుకుంది. గోదావరిపై బ్యారేజీ నిర్మాణా నికి వైఎస్సార్‌ తన హయాంలో ప్రతిపాదనలు పూ ర్తిచేశారు. నీటినిల్వ కోసం చేపట్టిన ఈ బ్యారేజీ ప నులు 2016లోనే ప్రారంభమయ్యాయి. అధికారికంగా 2017లో అప్పటి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.520 కోట్ల వ్యయంతో పదేళ్లపాటు నిర్మాణ పనులు కొనసాగాయి. నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో 1,200 ఎకరాల ముంపు భూములు ఉండగా, 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు.

పర్యటన ప్రతిష్టాత్మకంగా...

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి జిల్లాకు తొలిసారి రానుండటంతో అటు జిల్లా అధికారులు, ఇటు కాంగ్రెస్‌ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బ్యారేజీ వద్ద పనులు పూర్తిచేయడం, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల, ఇరిగేషన్‌ అధికారులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఓసారి జిల్లా ఉన్నతాధికారులు పొన్కల్‌ వద్ద బ్యారేజీని పరిశీలించి వచ్చారు. మరోవైపు జిల్లాకేంద్రంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు శ్రమిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్‌, నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌అలీ, మున్సిపల్‌ మాజీచైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్‌ తదితరులు బహిరంగ సభ స్థల పరిశీలన, ఏర్పాట్లపై సోమవారం పర్యవేక్షించారు.

పొన్కల్‌ వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సదర్మాట్‌ బ్యారేజీ

సీఎం ముందుకు డిమాండ్లు..

సదర్మాట్‌ బ్యారేజీకి సంబంధించి పలు డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుకు తీసుకువచ్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

షెడ్యూల్‌ ఇలా..

ఈనెల 16న హైదరాబాద్‌ నుంచి సీఎం నేరుగా ఆది లాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ చనాఖ–కొ రాట పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు పొన్కల్‌ చేరుకోనున్నా రు. సదర్మాట్‌ బ్యారేజీ ప్రారంభిస్తారు. 2 గంటలకు నిర్మల్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.

సదర్మాట్‌ సిద్ధం! 1
1/1

సదర్మాట్‌ సిద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement