
సమయం లేదు మిత్రమా..!
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వచ్చేనెల 13న జరగనుంది. అర్హులైన కొత్త ఓటర్లందరూ తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఈనెల 15 వరకు చివరి గడువుగా ఉంది.
10లోu
శనివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
కామోల్‌లో కుంకుమార్చన
భైంసారూరల్: మండలంలోని కామోల్ శ్రీసీతా రామస్వామి ఆలయంలో నవమి వేడుకలు కొ నసాగుతున్నాయి. శుక్రవారం కుంకుమార్చన పూజలు చేశారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు హరిమౌనస్వామి ప్రవచనాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికబాటలో పయనించాలని సూచించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని పేర్కొన్నారు. ప్రతీ వ్యక్తి దేవుని కోసం సమయం కేటాయించాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. అనంతరం భక్తులంతా స్వామివారిని దర్శించుకున్నారు.
చర్యలు చేపడతాం
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బెంబర, ఝరి(బి), మహలింగి, బామ్ని, భోసి, అటవీ ప్రాంతంలో చిరుత సంచారిస్తూ పశువులపై దాడి చేస్తోంది. జరిగిన ఘటలను పరిశీలించి చిరుత ఆనవాళ్లుగా గుర్తించాం. తాజాగా బెంబర గ్రామంలో దూడపై చిరుత దాడి చేసినట్లు ధ్రువీకరించాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చిరుతల సంచారం లేకుండా చర్యలు చేపడతాం.
– మహేశ్, అటవీశాఖ బీట్ అధికారి
న్యూస్‌రీల్



కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు