నిర్మల్ రూరల్: స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆది వారం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్ ప్రారంభిస్తారన్నారు. విషయ నిపుణులతో ఫండమెంటల్ రూల్స్, లీవ్ రూల్స్, సీసీఏ రూల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సంఘం సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు.