రోడ్డు వేస్తేనే.. ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికల బహిష్కరనే | - | Sakshi
Sakshi News home page

రోడ్డు వేస్తేనే.. ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికల బహిష్కరనే

Oct 11 2023 7:40 AM | Updated on Oct 11 2023 8:38 AM

- - Sakshi

వాగు వద్ద సమావేశమైన గంగాపూర్‌, రానిగూడ, కొర్రతండా వాసులు

నిర్మల్‌: తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మండలంలోని గంగాపూర్‌, రానిగూడ, కొర్రతండా జీపీల పరిధిలోని 12 గ్రామాల ప్రజలు నిర్ణయించారు. ఆయా గ్రామాల నుంచి కడెం వరకు పాదయాత్రగా వచ్చేందుకు ప్రజలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగాపూర్‌ గ్రామ సమీపంలోని వాగు వద్ద నిరసన తెలిపారు.

నాయకులు, ప్రభుత్వాలు మారుతున్నా తమ ఊళ్ల రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లోకి అధికారులను, నాయకులను కూడా రానివ్వమని హెచ్చరించారు. మూడు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఇక నుంచి విధులకు రావొద్దని తెలిపారు. నిరసనలో గంగాపూర్‌, రానిగూడ, కొర్రతండా సర్పంచులు శాంత, భీంబాయి, సదర్లాల్‌, నాయకులు చంద్రహాస్‌, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement