వెదురు సాగుతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

వెదురు సాగుతో లాభాలు

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

● మూడు మండలాల ఎంపిక ● 338 మంది రైతుల ఆసక్తి ● రెండు వేల ఎకరాల్లో సాగు

వాతావరణం

8లోu

తొలి తెలుగు పండుగ ఏకాదశి

హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఈ పండుగ నుంచే కొత్త తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి.

మామడ: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చే సేందుకు, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు, గ్రామీణులకు జీ వనోపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ( VBRAMG) వికసిత్‌ భారత్‌ గ్రామీణ రోజ్‌గార్‌ ఆజ్‌వికా మిషన్‌ గ్రామీణ్‌ పథకం కింద వె దురు సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో సెర్ప్‌ ఆధ్వర్యంలో నర్సరీలు నిర్వహించి వెదురు సాగు చేసె రైతులను సర్వే ద్వారా గుర్తించారు. జిల్లాలో వెదురు సాగుకు అనుకూలంగా ఉన్న మండలాలను గుర్తించి సాగుకు ఎంపిక చేశారు. ఇందుకోసం సెర్ప్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి రైతులను ఎంపిక చేశారు. మామడ మండలంలో 145మంది రైతులు 700 ఎకరాలు, సారంగపూర్‌ మండలంలో 122 మంది రైతులు 600 ఎకరాలు, పెంబి మండలంలో 71మంది రైతులు 700 ఎకరాల్లో వెదురు సాగు చేసేందుకు ముందుకువచ్చారు. వీరికి వెదురు సాగులో ఎరువుల వినియోగం, సంరక్షణ పద్ధతుల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

సాగు విధానం.. లాభాలు

వెదురు మొక్కల పెంపకం నర్సరీల నిర్వహణను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెదురు మొక్కలను పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు ఉచితంగా మొక్కలు అందిస్తారు. ఎకరంలో 160 మొక్కలు నాటాలి. మొక్క నాటేందుకు ఒక్కో గుంత తవ్వేందుకు రూ.78, మొక్క నాటేందుకు రూ.41, మొక్క సంరక్షణకు నెలకు రూ.41 వీబీ జీ రాంజీ పథకం ద్వారా రైతుకు అందజేస్తారు. మూడేళ్లలో ఎకరంలో సాగు చేసిన రైతులకు ఒక్కొక్కరికి నిర్వహణ కోసం రూ.1.12 లక్షలు ఇస్తారు. వెదురుసాగు చేసే భూముల్లో మూడేళ్లపాటు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.

సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకా శం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ పెరుగుతుంది. అక్కడక్కడా వాన కురుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement