కడెం ప్రాజెక్ట్
కడెం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు న్నా కడెం ప్రాజెక్ట్‌పైనే ఆశలు పెట్టుకుని ఆయకట్టు రైతులు సాగుబాట పట్టారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీ టిమట్టం 700 అడుగులు(3.495టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 681.550 (207.736 టీఎంసీల) అడుగుల నీటిమట్టం ఉండగా, గతేడాది జూలై 24న 694.950 అడుగుల నీటిమట్టం ఉంది. కాగా, ప్రాజె క్ట్ పూర్తి స్థాయిలో నిండగా 2021 జూలై 10న వరద గేట్లు ఎత్తారు. 2022లో జూలై 5న, 2023లో 19న, 2024లో 20న, 2025లో జూలై 10న గేట్లెత్తారు.
కొనసాగుతున్న మరమ్మతులు
ప్రాజెక్ట్ ఎడమ కాలువ తూము గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపా రు. ట్రాష్‌రాక్ పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ ఎడమ (ప్రధాన) కాలువ పాత తూము గేట్లు తొలగించి ఇ టీవలే కొత్తవి బిగించగా, వాటికి మోటర్లు అమర్చా లి ఉంది. ఎడమ కాలువకు రక్షణగా రూ.2.48 కోట్ల తో చేపట్టిన ట్రాష్‌రాక్ పనులు కొనసాగుతున్నా యి. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరిగితే పనులు తాత్కాలికంగా నిలిపివేసి ఆ తర్వాత పూర్తి చేయనున్నారు.
వరి వైపే రైతాంగం మొగ్గు
కడెం ప్రాజెక్ట్ ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల కు సాగు నీరందుతుంది. వానాకాలం సీజన్‌లో రై తులు వరి, పసుపు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభా వంతో వర్షభావ పరిస్థితులున్నాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు చె బుతున్నారు. అయితే, కడెం ఆయకట్టు రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రాజెక్ట్ నిండితే ఎలాగైనా వరి పండుతుందని భరోసాతో ఉన్నారు.


