కుంటాల: పత్తి, సోయాలో చీడపీడల నివారణకు చర్యలు చేపట్టాలని ముధోల్ ఏరువాక శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, దినేశ్ సూచించారు. కుంటాల, ఓలా శివారులోగల పత్తి, సో యా పంటలను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరి శీలించారు. రైతు సీపతి ముత్యం పత్తి పంటను పరిశీలించి అధిక సాంద్రత పత్తి సాగు, బోదెల విధానం, చీడ పీడల నియంత్రణపై మెళకువలు వివరించారు. రైతు సబ్బిడి గజేందర్ సో యా పంటను పరిశీలించి తెల్ల దోమ ఉధృతి ఎ క్కువగా ఉందని గుర్తించారు. ఎల్లో వీన్ మొజా యిక్ నివారణకు ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2ఎంఎల్, ఉలాలా లీటర్ నీటికి 10ఎంఎల్ పిచికారీ చేయాలని సూచించారు. ఏఈవోలు శ్రీనివాస్, హర్షిత, రైతులు సబ్బిడి రాకేశ్, కుమ్మరి రమేశ్, గొల్ల గజేందర్ తదితరులున్నారు.


