మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

భైంసాటౌన్‌: యువత మత్తు పదార్థాలకు దూ రంగా ఉండాలని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడవద్దని భైంసా జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్కే వెంకటరమణ సుహాస్‌ సూచించారు. ప ట్టణంలోని గురుకుల వొకేషనల్‌ కళాశాలలో ‘మాదకద్రవ్యాలు–యాంటీ ర్యాగింగ్‌‘పై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు హా జరై మాట్లాడారు. డ్రగ్స్‌ వినియోగం సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపా రు. ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణతో మె లగాలని సూచించారు. పట్టణ సీఐ సాయికుమార్‌, న్యాయవాదులు అమ్జద్‌ షేక్‌, చిన్నన్న, కళాశాల చైర్మన్‌ రామకృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement