ఇక స్మార్ట్‌గా రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్‌గా రేషన్‌

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

● జిల్లాకు చేరుకున్న కొత్త కార్డులు ● లబ్ధిదారులకు పంపిణీకి ఏర్పాట్లు ● మరింత పెరగనున్న పారదర్శకత ● కార్డుతో బహుళ ప్రయోజనాలు! శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026

8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

ప్రతి నీటిబొట్టూ ఒడిసి పట్టాలి

లక్ష్మణచాంద: ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు తోడ్పాలని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. జలసిరిలో భాగంగా మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఫామ్‌పాండ్‌ పనులు ప్రారంభించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ రైతు పంట చేనులో ఫామ్‌పాండ్స్‌, బోరు బావుల వద్ద రీచార్జీ గుంతలు, ఇళ్లలో సోక్‌ ఫీ ట్స్‌ నిర్మించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రా మంలో ఐదు ఫామ్‌పాండ్స్‌ నిర్మించేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌ ఓస కవిత రాజు, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీవో నసీరుద్దీన్‌, ఏపీవో ప్రమీల, ఉప సర్పంచ్‌ వర్ష రవి, టీఏలు దినేశ్‌, భీమ్‌, నాయకులు రమేశ్‌, ఓస రాజు, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ తదితరులున్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంపు, లబ్ధిదారులకు మెరుగై న సేవలందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం స్మా ర్ట్‌ రేషన్‌ కార్డులను అందుబాటులోకి తీ సుకురానుంది. జిల్లా కు అవసరమైన కార్డులు ఇప్పటికే వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపా యి. ప్రభుత్వం నుంచి పంపిణీ కి తుది అనుమతి రాగానే దశలవారీ గా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,49,606 రేషన్‌కార్డులు జారీ కానున్నా యి. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కాగితపు ల్యామినేషన్‌ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు తరహాలో ఉండే పీవీసీ స్మార్ట్‌ కార్డులు ఇవ్వనున్నారు. వీటిలో లబ్ధిదారుల పూర్తి వివరాలు, కుటుంబ స భ్యుల సమాచారం, ప్రత్యేక గుర్తింపు వివరాలు డిజి టల్‌ రూపంలో పొందుపరిచారు. కార్డు చిరిగిపోకుండా, నీటిలో తడిచినా వివరాలు చెరిగిపోకుండా దీర్ఘకాలం ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

జిల్లాలో 2,49,606 కార్డులు

జిల్లాలో 421 రేషన్‌ దుకాణాలు న్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,49,606 కార్డులున్నాయి. ఇందులో ఆహారభద్రత కా ర్డులు 2,36,562, అంత్యోదయకార్డులు 13,012, అన్నపూర్ణ కార్డులు 32 ఉండగా, నెలకు 4,867.168 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు జిల్లాలో లబ్ధిదారులకు ప్రత్యేకంగా రేషన్‌కార్డులు లేవు. గతంలో కొంత మందికి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వచ్చే కాగితాలనే వాడుతున్నారు. రేషన్‌ కార్డు నంబర్‌ చెప్పినా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆదాయం సర్టిఫికెట్‌, ఆరోగ్యశ్రీ పథకం కింద చికి త్స పొందాలన్నా రేషన్‌ కార్డులు అందుబాటులో లేక లబ్ధిదారులు ఇబ్బంది పడేవారు.

పారదర్శకతకు పెద్దపీట

స్మార్ట్‌ కార్డుపై యజమాని పేరు, చిరునామా ఉండటంతో పాటు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో ఉంటుంది. లబ్ధిదారు రేషన్‌ దుకాణానికి వెళ్లి డీలర్‌కు కార్డు ఇస్తే తన వద్ద ఉన్న ఈపాస్‌ యంత్రంలో స్కాన్‌ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోవాల్సిన రేషన్‌ సరుకుల వివరాలు కనిపిస్తాయి. స్మార్ట్‌ కార్డుల ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కార్డులో పొందుపరిచిన డిజిటల్‌ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సులభమవుతుంది. బోగస్‌ కార్డులు, డూప్లికేట్‌ నమోదు లాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది. ప్రభుత్వానికి కూడా లబ్ధిదారుల వివరాల నిర్వహణ మరింత సులభతరం కానుంది.

ఆదేశాలు రాగానే పంపిణీ

లబ్ధిదారులకు నూతనంగా స్మార్ట్‌కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా కుటుంబానికి ఒకటి చొప్పున స్మార్ట్‌ కార్డులు జిల్లాకు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పంపిణీ చేయనున్నాం. – రాజేందర్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

పన్నుల చెల్లింపు ఇక సులభం

పురపాలక సేవలను పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తూ పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకృత పన్ను విధానానికి శ్రీకారం చుట్టింది.

ఒకే కార్డు.. సేవలు అనేకం!

స్మార్ట్‌ రేషన్‌కార్డు కేవలం బియ్యం పంపిణీకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసే అవకాశాలున్నాయి. కుటుంబ వివరాల ధ్రువీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు లాంటి అవసరాలకు కూడా ఈ కార్డు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఒకే కార్డు ద్వారా బహుళ ప్రయోజనా లు పొందే అవకాశం ఏర్పడనుంది.

జిల్లాలో ‘రేషన్‌’ వివరాలు

రేషన్‌ షాపులు 412

నెల బియ్యం కోటా 4867.168

మెట్రిక్‌ టన్నులు

మొత్తం రేషన్‌ కార్డులు 2,49,606

ఆహార భద్రత కార్డులు 2,36,562

అంత్యోదయ కార్డులు 13,012

అన్నపూర్ణ కార్డులు 32

పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాకు స్మార్ట్‌ కార్డులు చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాలు, మండలాల వారీగా పంపిణీ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రేషన్‌ షాపులు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శి బిరాల్లో లబ్ధిదారులకు కార్డులను అందజేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement