CM Yogi: 28 ఏళ్ల తర్వాత సొంతూరికి.. తల్లి ఆశీర్వాదంతో సీఎం యోగి భావోద్వేగం

Yogi Adityanath Visit Own Village After 28 Years Meets Mother - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. తన వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటివరకైతే చూసింది లేదు. అలాంటి వ్యక్తి..  సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టారు. అంతేకాదు తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు.

యోగి ఆదిత్యానాథ్‌ సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు యూపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన తల్లిని కలవడం ఇదే తొలిసారి!. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయనే ట్విటర్‌లో షేర్‌ చేశారు.

బుధవారం యోగి మేనల్లుడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్లారు. సీఎంగా ఒక అధికారిక కార్యక్రమం బదులు.. సొంత పని మీద వెళ్లడం ఆయనకు ఇదే తొలిసారి కావడం విశేషం. 

కరోనా టైంలో(ఏప్రిల్‌ 2020) హరిద్వార్‌లో ఆయన తండ్రి చనిపోగా.. అంత్యక్రియలకు ఆయన హజరు కాలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా.. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్‌ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్‌ అవైద్యనాథ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన.

చదవండి: విభజన రాజకీయాలు దేశానికి మంచివికావు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top