
సాక్షి,బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పొంగల్‌లో పురుగు కనిపించిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన రెస్టారెంట్‌కు ఉన్న పేరును బద్నాం చేసేందుకు జరిపిన కుట్రలో భాగమేనని రామేశ్వరం కేఫ్ యజమానులైన రాఘవేంద్రరావు,ఆయన సతీమణి దివ్యా రాఘవేంద్ర రావులు ఓ నోట్‌ను విడుదల చేశారు. ఫేక్ వీడియో చూపించి రూ.25లక్షలు కొట్టేసే ప్లాన్‌లో భాగమేనని ఆధారాల్ని బయట పెట్టారు
బెంగళూరు విమానాశ్రయంలోని రామేశ్వరం కేఫ్‌లో పొంగల్‌లో పురుగు కనిపించిన ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఓ కస్టమర్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని రామేశ్వరం కేఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా పొంగల్ ఆర్డర్ చేశారు. ఆహారం తింటున్న సమయంలో అతను పొంగల్‌లో పురుగు ఉందని గుర్తించి, వెంటనే స్టాఫ్‌కు సమాచారం ఇచ్చాడు. కానీ కేఫ్ యాజమాన్యం పట్టించుకోలేదు.
దీంతో కోపోద్రికుడైన కస్టమర్.. కేఫ్ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలో పొంగల్‌లో పురుగు పడిందంటూ ఓ స్పూన్‌ను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కేఫ్ ఓనర్‌ను సంప్రదించాలా? అంటూ చర్చించారు. ఆ వీడియోతో దిగివచ్చిన నిర్వహకులు కస్టమర్‌కు క్షమాపణలు చెప్పారు. రూ. 300 రీఫండ్ ఇచ్చారు.
కానీ అసలు విషయం ఏంటంటే? తమ రెస్టారెంట్ పొంగల్‌లో పురుగు లేదని రామేశ్వరం కేఫ్ యాజమాన్యం ట్వీట్‌లో ఓ నోట్‌ను విడుదల చేసింది. ‘‘ ఆ నోట్‌లో.. మా రెస్టారెంట్ ఐదారుగురు కస్టమర్లు వచ్చారు. పొంగల్‌లో పురుగుపడిందని హడావిడి చేశారు. పొంగల్‌లో పురుగు పడింది కాబట్టి తమకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే మేం తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు.
పొంగల్‌లో పురుగు పడిందని ఫిర్యాదుతో కస్టమర్‌కు క్షమాపణులు చెప్పి.. తిరిగి రూ.300 డబ్బులు కూడా ఇచ్చాం. డబ్బులు తీసుకొని సదరు కస్టమర్లు వెళ్లిపోయారు. అలా వెళ్లారో లేదో మాకు ఫోన్ చేశారు. మీ కేఫ్‌కు ఉన్న పరువు,ప్రతిష్ట దెబ్బతినకూడదంటే మాకు రూ.25లక్షలు ఇస్తే మేం సైలెంట్‌గా ఉంటామని చెప్పారు. మేం అందుకు ఒప్పుకోలేదు. మేం కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారాల్ని అందిస్తున్నాం. కస్టమర్లకు అందించే ఆహారం విషయంలో మేం ఎక్కడ రాజీపడబోం అంటూ అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు అందించినట్లు చెప్పారు. తమ రెస్టారెంట్‌పై వస్తున్న వదంతుల్ని కస్టమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు,రెస్టారెంట్‌పై అసత్య ఆరోపణలు చేసిన కస్టమర్లను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
గతంలో పలువురు కస్టమర్లు.. తమ భోజనంలో పురుగులు,ఈగలు, రాళ్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. న్యాయపరంగా అవన్నీ అవాస్తవాలేనని గుర్తించినట్లు వెల్లడించారు.
Press Release pic.twitter.com/KgvVOpwGFu
— The Rameshwaram Cafe (@RameshwaramCafe) July 24, 2025