breaking news
blackmail and extortion
-
అవినీతి ఐఏఎస్.. డిటెక్టివ్ జంటకు ఝలక్
థానే : ఓ సీనియర్ సివిల్ సర్వీస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో డిటెక్టివ్ దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు థానే పోలీసులు ప్రకటించారు. ప్రైవేట్ డిటెక్టివ్ సతీష్ మంగలే ఆయన భార్య శ్రద్ధాలు ఐఏఎస్ అధికారి రాధేశ్యామ్ మోపల్వార్ను ఏడు కోట్లు చెల్లించాలంటూ గత కొంత కాలంగా బెదిరిస్తున్నారు. అక్టోబర్ 23న ఆ డబ్బును నాసిక్ హైవేలో ఉన్న ఖరేగావ్ టోల్ ఫ్లాజా వద్ద అప్పగించాలని.. లేకపోతే రాధేశ్యామ్ అవినీతి గుట్టును బయటపెడతామని వాళ్లు బెదిరించారు. దీంతో మోపల్వార్ ఆ ఫోన్లను నేరుగా థానే పోలీసులకు అనుసంధానం చేశారు. బెదిరింపులు నిజమని నిర్థారించుకున్న తర్వాత చివరకు ఓ కానిస్టేబుల్‌ను మారువేషంలో కోటి రూపాయలు ఇచ్చి దొంబివాలీలో ఆ దంపతులు అద్దెకు ఉంటున్న ఇంటికి పంపించారు. అనంతరం డబ్బు తీసుకుంటుడగా వారిని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ దంపతులతోపాటు వారికి సహకరించిన అనిల్ వేద్మెహతాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్న రెండు ల్యాప్ ట్యాప్‌లు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు పెన్ డ్రైవ్‌లు, 15 సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు థానే పోలీసులు వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థకు రాధేశ్యామ్ గతంలో వైస్ చైర్మన్‌గా వ్యవహరించేవారు. అవినీతి ఆరోపణలు వెలుగు చూడటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగష్టులో ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే సతీష్ మంగలే లీక్ చేసిన ఆడియో సంభాషణల మూలంగానే ఆయన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఓ వాదన ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి టేపులు భయటపెడతామంటూ బెదిరించి ఆ డిటెక్టివ్ దంపతులు రాధేశ్యామ్‌ను మరోసారి బెదిరించినట్లు తెలుస్తోంది. -
ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!
న్యూఢిల్లీ: ఎంపీలను బురిడీ కొట్టించిన కిలేడీని ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను కలిసి వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వారితో అసభ్యంగా ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఇటీవల గుజరాత్‌లోని వల్సాద్కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి ఆపై ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగిన ఆ మహిళ రూ.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంతా మోసమని గ్రహించిన ఎంపీ పటేల్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మార్చి నెలలో డిన్నర్‌కు పిలిచి అత్యాచారం చేశారని, ఆసమయంలో తాను ఎలాగోలా వీడియో తీశానని మహిళ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరింది, ఢిల్లీ పరిధిలో అన్యాయం జరిగింది కనుక అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఎంపీ కేసీ పటేల్ పలుమార్లు తనపై అత్యాచారం చేశానని కథలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతేడాది హర్యానాకు చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన ఆ మహిళ.. కేసు విచారణ ప్రారంభించగానే కేసు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎంపీ కేసీ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఓ మహిళ డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. సాయం కోసం వచ్చిన మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిందని, ఆపై తన గ్యాంగుతో కలిసి కొన్ని వీడియోలు తీసిందని ఆరోపించారు. ఘజియాబాద్‌లో ఇల్లు రాసివ్వాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. బ్లాక్ మెయిల్, దోపీడీకి సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తాను నిర్దోషినని తేలుతుందని ధీమా వ్యక్తంచేశారు.