ఇన్‌స్టా రీల్స్‌పై వివాదం.. భర్తను హతమార్చిన భార్య | Woman Kills Husband For Stopping Her From Making Insta Reels | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా రీల్స్‌పై వివాదం.. భర్తను హతమార్చిన భార్య

Jan 8 2024 12:55 PM | Updated on Jan 8 2024 1:06 PM

Woman Kills Husband For Stopping Her From Making Insta Reels - Sakshi

ఇన్‌స్టా రీల్స్ చేయడాన్ని అడ్డుకున్నందుకు ..

పాట్నా: బిహార్‌లోని బెగుసరాయ్‌లో దారుణం జరిగింది. ఇన్‌స్టా రీల్స్ చేయడాన్ని అడ్డుకున్నందుకు ఓ మహిళ తన భర్తను హతమార్చింది. రీల్స్ చేసే క్రమంలో భర్త వ్యతిరేకించి అడ్డుకున్నాడు. కోపోద్రిక్తురాలైన మహిళ తన తల్లిదండ్రులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఖోడాబంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో చోటుచేసుకుంది.

మృతుడు సమస్తిపూర్ జిల్లాలోని నర్హన్ గ్రామ నివాసి మహేశ్వర్ కుమార్ రేగా గుర్తించారు. మహేశ్వర్ కోల్‌కతాలో కూలీ పని చేస్తూ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం ఫఫౌట్ గ్రామంలో ఉండే  అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ భార్య రాణి కుమారి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయడం ప్రారంభించింది.

ఈ క్రమంలో మహేశ్వర్ తన భార్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన రాణి తన తల్లిదండ్రుల సహాయంతో భర్తను హతమార్చింది. మృతుని సోదరుడు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

ఇదీ చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి తండ్రి కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement