తమిళనాడు: భర్తను చనిపోతే రుణదాతల ఒత్తిళ్ల నుంచి బైటపడవచ్చని భావించిన ఓ మహిళ కట్టుకున్న వాడినే లేపేసేందుకు స్కెచ్ వేసింది. అతడి చెవిలో విషం పోసింది. వివరాలు.. తంజావూరు జిల్లా, తిరువిడైమరుదూర్ తాలూకాలోని పుళుదికుడికి చెందిన కూలీ రవిచంద్రన్ (54), ఉమారాణి (48)ని 27 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమారుడు విదేశాలలో పని చేస్తుండగా, కుమార్తెకు పెళ్లైంది. రవిచంద్రన్ కొత్తగా ఇంటి నిర్మాణం కోసం మీద పాలారి-డ్యామ్, ఇతర గ్రూపుల నుంచి రూ.10లక్షల రుణం పొందాడు.
దీనిని చెల్లించలేకపోవడంతో తరచూ దంపతులు మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోతే రుణం తీర్చాల్సిన ఒత్తిడి ఉండదని భావించిన ఉమారాణి, తన తమ్ముడు జ్ఞానశేఖరన్ (35)తో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. మంగళవారం రాత్రి రవిచంద్రన్ నిద్రిస్తున్న సమయంలో అతడి చెవిలో వారిద్దరూ విషం పోశారు. మేల్కొన్న రవిచంద్రన్ వారి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో కుంభకోణం ఆస్పత్రిలో చేరాడు.
అతని ఫిర్యాదు ఆధారంగా, తిరువిడైమరదూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఉమారాణి, జ్ఞానశేఖర్‌ను అరెస్టు చేశారు. ప్రాధమిక విచారణలో మూడు నెలల క్రితమే ఆ ఇద్దరూ టీ లో విషం కలిపి అతన్ని చంపడానికి ప్రయత్నించారని, ఆ ఘటన నుంచి తప్పించుకున్న రవిచంద్రన్, అప్పటి నుంచి ఇంట్లో ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్నాడని తేలింది. ఈ క్రమంలో చెవిలో విషం పోసినట్లు నిర్ధారౖణెంది. నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ నిమిత్తం తంజావూరు జైలుకు తరలించారు.


