
సాక్షి,న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పొందే రిటైర్మెంట్ ప్రయోజనాలేంటనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అందే రిటైర్మెంట్స్ బెన్ఫిట్స్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధాన ప్రయోజనాలు
పెన్షన్: నెలకు రూ.2 లక్షలకు పైగా (ఉపరాష్ట్రపతి జీతం రూ.4 లక్షలు.అందులో 50 నుంచి 60శాతం పెన్షన్‌గా వస్తుంది)
ప్రభుత్వ బంగ్లా: లూటెన్స్ ఢిల్లీలో టైప్ వీఐఐఐ బంగ్లాలో నివాసం ఉండొచ్చు.
ఉచిత ప్రయాణం: రైలు,విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు
వైద్య సేవలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం,వ్యక్తిగత డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు
సిబ్బంది: ఇద్దరు వ్యక్తిగత సహాయకులు (PAs), భార్యకు ప్రైవేట్ సెక్రటరీ
ఇతర సౌకర్యాలు: ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు
విద్యుత్, నీటి బిల్లులు: ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రయోజనాలు ధన్‌ఖడ్ ఉపరాష్ట్ర పతి పదవిలో రెండేళ్లు పూర్తి చేసినందున వర్తిస్తాయి