అక్టోబర్‌ 1 నుంచి తెరచుకోనున్న సినిమా హాళ్లు

West Bengal Allows Cinema Halls To Operate From October 1st - Sakshi

కోల్‌కతా: లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు, ఓపెన్‌-ఎయిర్‌ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు అనుమతిస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా గత ఆరు నెలలుగా లాక్‌డౌన్‌ విధించారు. అప్పటి నుంచి థియేటర్లు మూసే ఉన్నాయి. అయితే సీఎం తాజా నిర్ణయంతో 'అక్టోబర్‌ 1 నుంచి థియేటర్లు తెరచుకోనున్నాయి.  (లూడో గేమ్‌లో మోసం: తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె)

జత్రాలతో పాటు అన్ని మ్యూజికల్‌, డ్యాన్సింగ్‌ ఈవెంట్స్‌, మ్యాజిక్‌ షోలను అనుమతిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి కార్యక్రమాలకైనా, థియేటర్లకైనా కేవలం 50 మంది మాత్రమే అనుమతిస్తున్నాం. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కోవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలి' అని మమతా బెనర్జీ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.  (ఉమా భారతికి కరోనా పాజిటివ్‌)

పశ్చిమ బెంగాల్‌లో గడిచిన 24 గంటల్లో 3,181 కొత్త కేసులు నమోదుకాగా.. మొత్తంగా ఇప్పటిదాకా 2,44,240 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 25,544 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,721 కరోనా మరణాలు సంభవించాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top