లోకాయుక్తకు పట్టుబడిన అధికారిణి  | Weights Measures Officer Caught By Lokayukta AtKarnataka | Sakshi
Sakshi News home page

లోకాయుక్తకు పట్టుబడిన అధికారిణి 

Feb 9 2023 8:26 AM | Updated on Feb 9 2023 8:29 AM

Weights Measures Officer Caught By Lokayukta AtKarnataka - Sakshi

పట్టుబడిన అధికారిణి మాలాకిరణ్‌ (ఫైల్‌)   

సాక్షి, కర్ణాటక: పెట్రోల్‌ బంక్‌ రెన్యూవల్‌కు అవసరమైన ధ్రువీకరణపత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల అధికారిణి  ఎస్‌.మాలాకిరణ్‌ లోకాయుక్తకు చిక్కారు. వివరాలు... చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట రోడ్డులో బసవేశ్వర పెట్రోల్‌ బంక్‌ ఉంది. బంక్‌ రెన్యూవల్‌కు అవసరమైన పత్రం కోసం యజమాని తూనికలు, కొలతల అధికారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారిని మాలకిరణ్‌ రూ.8వేలు డిమాండ్‌ చేశారు. ఏపీఎంసీ ఆవరణలోని కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. నగదను స్వాధీనం చేసుకొని మాలకిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్‌కు ఆదేశించారు. మరో వైపు బెంగళూరులోని మాలకిరణ్‌ నివాసంలో సోదాలు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement