పాము తల కట్‌ చేసి..కాసేపు అయ్యాక తాకాడు.. అంతే ఒక్కసారిగా పైకి ఎగిరి

Viral Video: Snake Head Is Severe Injured, Still It Attacks Man - Sakshi

పాములు అంటే చాలామందికి భయం.. కొంతమంది పాము కనపడితే చాలు అరకిలోమీటర్‌ ఆగకుండా పరుగెత్తుతారు. ఈ విష సర్పాల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా అది మన ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతెందుకు వందల పాములు పట్టిన వ్యక్తులు కూడా చివరికి అదే పాము కాటుకు బలైన ఘటనలు ఇటీవల వింటూనే ఉన్నాం.  ఓ పాము శిరచ్చేధనం చేసిన కూడా దాడికి యత్నించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇంటర్నట్‌ వాడకం పెరిగినప్పటి నుంచి ప్రజలకు ఏది కావాలన్నా అన్ని మొబైల్‌లోనే ప్రత్యక్షమవతున్నాయి. దీంతో ఎక్కడ ఏది జరిగినా వాటిని చిత్రీకరించి నెట్టింట షేర్‌ చేయడం షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్లను నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ, ఇంకొన్ని భయపెడుతుంటాయి. తాజాగా ఓ వీడియోలో.. తల లేని పాము పక్కన ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. తీవ్రంగా గాయపడి ఉండడం, తల లేకుండా కదలకుండా ఉండేసరికి అది చనిపోయి ఉందని నిర్థారించుకుంటాడు. ఇంతలో ఆ వ్యక్తి సడన్‌గా ఆ పాము తోక  తాకగానే రెప్పపాటులో అది దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో గతంలో జరిగిన తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top