Viral Video: President Droupadi Murmu Flies In Fighter Jet From Assam's Tezpur - Sakshi
Sakshi News home page

సుఖోయ్‌ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Apr 8 2023 2:19 PM | Updated on Apr 8 2023 3:00 PM

Viral Video: Droupadi Murmu Flies In Fighter Jet From Assams Tezpur - Sakshi

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్‌ 30 ఎంకేఐ విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె శనివారం ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానికి స్థావరానికి చేరుకున్నారు. తొలుత అక్కడ ఆమె భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తదనంతరం ఆమె యుద్ధ విమానంలో పర్యటించేందుకు యాంటీ గ్రావిటీ సూట్‌ ధరించి..సుఖోయ్‌ 30లో కొద్దిసేపు ప్రయాణించారు.

ఈ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. దీంతో ఈ సుఖోయ్‌లో పర్యటించిన భారత రెండోవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. కాగా 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌​ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ సుఖోయ్‌ 30 ఎంకేఐ అనేది రెండు సీట్లతో కూడిన ఫైటర్‌ జెట్‌. దీన్ని రష్యాకి చెందిన సుఖోయ్‌ సంస్థ అభివృద్ధి చేయగా..భారత ఏరోస్పేస్‌ దిగ్గజం హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఈ జెట్‌ని నిర్మించింది. 

(చదవండి: హనీ ట్రాప్‌లో అనుకోకుండా జరిగిన హత్య..ఐతే ఆ 'సారీ నోట్‌'..)

Advertisement
 
Advertisement
Advertisement