వేదికపై వధూవరులు.. జస్ట్‌ మిస్‌ లేదంటే ఎంత ఘోరం జరిగేది!

Viral Video: Bride Burns Her Face While Posing With Firecracker Gun - Sakshi

పెళ్లి అనేది జీవితంలో జరిగే మరిచిపోలేని ఘటన. అందుకే వధూవరులు ఆ రోజు ప్రత్యేకంగా ప్లాన్‌ చేసుకుంటూ ఆ జ్ఞాపకాలును జీవితాంతం గుర్తుగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఇంకొంత మంది మరొ అడుగు ముందుకేసి వైరటీ ఫోటో షూట్‌లంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ ట్రెండ్‌ పాటించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది.

తాజాగా మహారాష్ట్రలో ఓ పెళ్లి జంట కూడా ఇలాగే ప్లాన్‌ చేసింది గానీ.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. తమ పెళ్లి రోజున ఓ వధూవరులు మండపంపై తుపాకీలు పట్టుకుని ఫోటోలకు పోజులిస్తూ ఉంటారు. వారి చేతిలో ఉన్న తుపాకీల నిప్పులు (ఫైర్‌ గన్‌) వెదజల్లుతూ ఉంది. ఇదిలా కొనసాగుతుండగా వధువు చేతిలో ఉన్న తుపాకి  ప్రమాదవశాత్తు పేలుతుంది. భయంతో, ఆమె త్వరగా ఆయుధాన్ని పడవేసి దూరంగా వెళుతుంది. మంటలు అంటుకుంటాయనే భయంతో తన మెడలోని మాలను కూడా తొలగిస్తుంది. ప్రజలు ముందుకు వచ్చి ఆ వధువుకి సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు జస్ట్‌ మిస్‌ లేదంటే ఎంత ఘోరం జరిగేదని కామెంట్లు పెడుతున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top