Viral Post: బెంజ్‌ సీఈవోకు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి

Viral : Mercedes India CEO Gets Stuck In Pune Traffic Know What He Did Next - Sakshi

ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక పని నిమిత్తం రోడ్డు మీదకు వస్తుంటారు. ఆటో, కారు, బైక్‌, బస్సు.. లేదా నడక మార్గాన తమ గమ్యాలను చేరుకుంటారు. రోడ్డుపై జర్నీ అంటే తప్పక ట్రాఫిక్‌ సమస్య ఉంటుంది. కామన్‌ మ్యాన్‌ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అచ్చం ఇలాంటి అనుభవమే లగ్జరీ కార్ల తయారీ సంస్థ సీఈఓకు కూడా తప్పలేదు.

మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ మార్టిన్‌ ష్వేంక్‌ గురువారం రాత్రి సమయంలో పుణెలో తన ఎస్‌-క్లాస్‌ కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంతకీ ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో ఖరీదైన ఎస్‌-క్లాస్‌ కారు నుంచి దిగి నడక బాటపట్టారు. ఇలా కిలోమీటర్లు నడిచి.. ఆటోలో తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఈ మొత్తం సంఘటనను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు.  

ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ మీ ఎస్‌-క్లాస్ కారు పూణె రోడ్లలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉంటే మీరు ఏమి చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. సీఈఓ సింప్లిసిటీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంత కోటీశ్వరుడై ఉండి ఆటోలో వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్‌ గుర్తు చేసింది: కేటీఆర్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top