ఇదేం కక్కుర్తి! రిటైర్మెంట్‌కు ఒక్క రోజు ముందు..

Vigilance Raids Sub Registrar Suspended For Bribe Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ముందు సెయ్యారు జిల్లా రిజిస్ట్రార్‌ సస్పెన్సన్‌కు గురయ్యారు. వివరాలు.. తిరువణ్ణామలైలోని సెయ్యా రు జిల్లారిజిస్ట్రార్‌ కార్యాలయం నియంత్రణలో సెయ్యారు, ఆరణి, వెంబాక్కం, తెల్లారు సహా 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్‌గా సంపత్‌ పని చేస్తున్నారు. శనివారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

కానీ శుక్రవారం సస్పెన్సన్‌కు గురయ్యారు. ఆరణి సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సమయంలో భూమిని ప్రభుత్వం నిర్ణయించిన విలువ కన్నా తక్కువ విలువ కట్టి రిజిస్ట్రర్‌ చేయడంతో విజిలెన్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో రిటైర్డ్‌ అయ్యే ఒకరోజు ముందు అతనిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి..

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top