కోర్టులో హాజరైన హాథ్రస్‌ బాధిత కుటుంబీకులు

Victim family to attend Allahabad High Court  - Sakshi

లక్నో: యూపీలోని హాథ్రస్‌లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్‌ హైకోర్ట్‌ లక్నో బెంచ్‌ ఎదుట హాజరయ్యారు.  కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్‌ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్‌ 14న  అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top