కేంద్ర‌మంత్రి స‌దానంద గౌడ‌తో కిష‌న్‌రెడ్డి భేటీ

Union Minister Sadananda Gowda Had A Meeting With Kishan Reddy - Sakshi

సాక్షి, ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి  సదానంద గౌడతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి   భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా  అధికారులు ఎరువుల సరఫరాపై కింది అంశాలను వెల్లడించారు. 

• 2020 ఖరీఫ్ సీజన్‌ మొత్తానికి గానూ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అని ప్రతిపాదనలు అందాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు.. 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఎరువుల విభాగం 10.17 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచింది. (4.01 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో కలుపుకుని)

• ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 8.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరగింది. గతేడాది ఇదే సీజన్‌లో  5.09 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అమ్ముడైంది. ఈ సీజన్‌లో యూరియాకు ఊహించని విధంగా అధిక డిమాండ్ ఏర్పటినప్పటికీ.. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం.

• దీంతోపాటుగా  ఆగస్టు, 2020 కోసం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉండగా.ఎరువుల విభాగం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తాన్ని (2.67 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో సహా) అందుబాటులో ఉంచింది.  దిగుమతి చేసుకున్న యూరియా 2020 సెప్టెంబర్ నెల మధ్యనాటికి తెలంగాణకు సమీపంలోని ఓడరేవులను ఇవి చేరుకోవచ్చని భావిస్తున్నాము. కేంద్ర ఎరువుల విభాగం తెలంగాణ రాష్ట్ర ఎరువుల అవసరాలను నిశితంగా పరిశీలిస్తుందని, క్షేత్ర స్థాయి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా నిల్వలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని  మంత్రి  సదానంద గౌడ కిషన్ రెడ్డికి ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top