ఉగ్రదాడులపై హెచ్చరించిన యూఎన్‌ | UN Report Warns Significant Number Of ISIS Terrorists In Kerala Karnataka | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడులపై ఆ రెండు రాష్ట్రాలను హెచ్చరించిన యూఎన్‌

Jul 25 2020 2:59 PM | Updated on Jul 25 2020 3:01 PM

UN Report Warns Significant Number Of ISIS Terrorists In Kerala Karnataka - Sakshi

న్యూఢిల్లీ: కేరళ, కర్ణాటకల్లో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు ఐరాస నివేదిక హెచ్చరించింది. భారత ఉపఖండ టెర్రర్ గ్రూపులోని అల్-ఖైదా.. భారత్‌, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లకు చెందిన దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులను కలిగి ఉందని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్ తమ మాజీ నాయకుడు అసీమ్‌ ఉమర్‌ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు యూఎన్‌ నివేదికలో హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement