ప్రాణాలు తీసిన పుట్టగొడుగుల కూర

Two killed after consuming mushroom curry in Yeswanthpur - Sakshi

దక్షిణ కన్నడ జిల్లాలో తండ్రీ కొడుకులు మృతి

సాక్షి, బెంగళూరు: పుట్టగొడుగులు ఎన్నో పోషకాలతో కూడి ఉంటాయి, కానీ సురక్షితమైన రకాలని తిన్నప్పుడే పోషకాలు లభిస్తాయి, లేదంటే ప్రాణాలే తీస్తాయి. విషపూరిత పుట్ట గొడుగుల కూర తిని తండ్రీ కొడుకు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకాలో జరిగింది. పుదువెట్టు గ్రామం మీయారుపాదె కేరిమారుకు చెందిన గురువ మేఠ (80) ఆయన కొడుకు ఓడియప్ప (41)లు కూర తిన్న తరువాత స్పృహ కోల్పోయి మరణించారు. సోమవారం గురువ సమీపంలోని అడవిలోకి వెళ్లి పుట్ట గొడుగులను ఏరుకొచ్చాడు. రాత్రి ఇంటిలో కూర చేసుకొని ఆరగించి నిద్రపోయారు.  

ఉదయం లేవకపోవడంతో  
మంగళవారం ఉదయం తండ్రీ కొడుకులు ఉదయం 10 గంటలైనా లేవలేదు. అనుమానంతో పక్కింటివారు వచ్చి చూడగా విగతజీవులై ఉన్నారు. మరో కొడుకు ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ధర్మస్థల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు బెళ్తంగడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విషపూరితమైన పుట్టగొడుగులను తినడమే కారణమై ఉంటుందని తెలిపారు.

చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top