హథ్రాస్ : టీఎంసీ ఎంపీలపై పోలీసుల దౌర్జన్యం | TMC MPs including Derek OBrien, stopped from entering Hathras | Sakshi
Sakshi News home page

హథ్రాస్ : టీఎంసీ ఎంపీలపై పోలీసుల దౌర్జన్యం

Oct 2 2020 1:27 PM | Updated on Oct 2 2020 3:06 PM

TMC MPs including Derek OBrien, stopped from entering Hathras - Sakshi

సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ హథ్రాస్ సామూహిక హత్యాచార ప్రకంపనలు  కొనసాగుతున్నాయి. దళిత యువతి హత్యాచార ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు శుక్రవారం నిరసనకు దిగాయి.  ఈ క్రమంలో యూపీలోని బాధిత యువతి కుటుంబానికి కలుసుకునేందుకు టీఎంసీ ఎంపీలు బయలుదేరారు.  వారిని అనుమంతించే ప్రసక్తే లేదని పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో తృణమూల్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ముఖ్యంగా  డెరెక్ ఓ బ్రియన్, కాకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమా మొండల్‌హావ్‌తో సహా తృణమూల్ ఎంపీల ప్రతినిధి బృందాన్ని హత్రాస్‌లోకి ప్రవేశించకుండా శుక్రవారం నిలిపివేశారు. ఈ తోపులాటలో ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కింద పడిపోడంతో  అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను పోలీసులు అక్రమంగా అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎంపీలు మండిపడుతున్నారు.

మరోవైపు బాధితురాలి కుటుంబం అనుమతిలేకుండా రాత్రికి రాత్రికే బాధితురాలి  మృతదేహాన్ని దహనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు  తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా గురువారం స్వీకరించింది.  అక్టోబర్ 12 న తదుపరి విచారణకు రాష్ట్ర, జిల్లా అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది. కాగా హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని  గురువారం యూపీ పోలీసులు మార్గ‌మ‌ధ్య‌లోనే అడ్డుకున్న విష‌యం తెలిసిందే. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్నితొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఢిల్లీ నగంలో 144 సెక్షన్ విధించింది. ఇండియా గేట్ సమీపంలో ప్రదర్శనలు, అయిదుగురికి మించి అనుమతిచేదిలేదని పోలీసు ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement