
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు.
ధర్మపురి సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారిని తెలంగాణలో వనపర్తి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. విహారయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.