కరోనా​​ బీమా పాలసీ దారులు ఈ విషయాలు మీకు తెలుసా?

Things you must know while applying for covid claim settlement - Sakshi

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాది సంక్రమణ రేటు, మరణాల రేటు అధికంగా ఉంది. చాలా మంది ఆసుపత్రుల్లో బెడ్స్ లభించక ఇంట్లోనే ఉండి ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఉన్న కూడా కరోనా వల్ల అయిన ఖర్చులను భీమా సంస్థ ద్వారా తిరిగి తెలుసుకోవచ్చు. కరోనా సోకిన వారు మీ ఆరోగ్య భీమా సంస్థ నుంచి చికిత్సకు సంబంధించిన ఖర్చులను క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇబ్బందులు లేని క్లెయిమ్​ సెటిల్​మెంట్స్​ కోసం ఈ క్రింది విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

క్లెయిమ్​ సెటిల్​మెంట్ కోసం తెలుసుకోవాల్సిన అంశాలు:

  • కరోనా క్లెయిమ్‌లకు సంబందించి ఐఆర్​డీఏఐ రెగ్యులేటర్ పేర్కొన్న మార్గదర్శకాలను పూర్తిగా చదవండి. చాలా బీమా సంస్థలు క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నరౌండ్ సమయాన్ని తగ్గించాయి.
  • కోవిడ్ -19కి సంబంధించిన ఏవైనా లక్షణాలు మీరు గమనించినట్లయితే, వెంటనే ప్రభుత్వం చేత గుర్తింపబడిన ప్రయోగశాలలో పరీక్షించుకోవాలి.
  • మీకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ గందరగోళాన్ని నివారించడానికి.. మీరు తీసుకుంటున్న చికిత్సకు సంబందించిన పూర్తి వివరాలను వెంటనే మీ భీమా సంస్థకు తెలియజేయండి. మీరు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారా? లేదా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారా? అనేది వారికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల బీమా సంస్థకు క్లెయిమ్ మొత్తాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దానికి తదనుగుణంగా క్లెయిమ్​ను తిరిగి చెల్లిస్తారు.
  • చాలా భీమా కంపెనీలు ఆసుపత్రిలో చేరడానికి అంబులెన్స్ ఛార్జీలు కూడా చెల్లిస్తాయి. ఒకసారి మీరు తీసుకున్న కరోనా హెల్త్ పాలసీలో ఇది మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోండి.
  • మీరు గనుక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే, బీమా సంస్థ లేదా ఆసుపత్రిలోని మూడవ పార్టీ నిర్వాహకుడు(టిపీఎ)డెస్క్ నుంచి ప్రీ-ఆథరైజేషన్ ఆమోదం పొందాలి. 
  • ఆసుపత్రిలో చేరడానికి డాక్టర్ సిఫార్సు ఉండాలి. మీరు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయిన మొత్తం ఖర్చుల వివరాలను డాక్యుమెంట్ల ద్వారా బీమా సంస్థలు తేలియజేయలి. 
  • మీరు భీమా సంస్థ చెప్పిన నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మీరు నగదు రహిత సదుపాయాన్ని పొందవచ్చు. నెట్‌వర్క్ కాని ఆసుపత్రి చికిత్స విషయంలో మీరు చికిత్స కోసం చెల్లించిన నగదును తిరిగి రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లిస్తాయి.
  • క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మెడికల్ హెల్త్ కార్డ్, హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్​, ఆసుపత్రిలో చేరడానికి వైద్యుడు సూచించిన డాక్యుమెంట్లు వంటి పత్రాలను భీమా సంస్థకు సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది.
  • ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే, మీ చికిత్స చేయించుకుంటున్న ఆసుపత్రి భీమా నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు మీ క్యాష్ లెస్ క్లెయిమ్​ను తిరస్కరించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు మీ బీమా సంస్థకు ఫిర్యాదు చేయాలి. దీంతోపాటు మీ ఫిర్యాదు కాపీని ఐఆర్‌డీఎకు కూడా సమర్పించాలి.

చదవండి: 

వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top