తారకరత్నకు మెలెనా! అరుదైన ఈ వ్యాధి గురించి తెలుసా.. ?

Taraka Ratna Suffered With Melena Causes Symptoms Treatment - Sakshi

సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్‌డేట్‌ అందింది.  అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. 

జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు,  చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్‌ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. 

కారణాలు.. 
ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం.  కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. 
 
మెలెనా లక్షణాలు.. 
మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది.  విపరీతమైన దుర్వాసన వస్తుంది.  హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. 

రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. 

చికిత్సలు
పెప్టిక్‌ అల్సర్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్‌ ఎంబలైజేషన్‌, సర్జికల్‌ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి.  అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు.  ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది.

ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ  నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top