శభాష్ పూల్‌పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం! | Tamilnadu: Beggar Donates Over 50 Lakhs For School Development Vellore | Sakshi
Sakshi News home page

Tamilnadu: శభాష్‌ పూల్‌పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం!

Jul 26 2022 11:12 AM | Updated on Jul 26 2022 3:34 PM

Tamilnadu: Beggar Donates Over 50 Lakhs For School Development Vellore - Sakshi

వేలూరు(చెన్నై): భిక్షాటన చేయగా.. వచ్చిన సొమ్మును సీఎం సహాయనిధికి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యాచకుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్‌పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు.

సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చా డు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌కు అందజేశారు. అనంతరం పూల్‌ పాండి మాట్లాడుతూ.. తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని, వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు.

చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్‌ను కదిలిస్తున్న వీడియో చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement