మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్‌’  | Tamil Nadu CM Vijay Launches Singappen Force to Tackle Crimes Against Women | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్‌’ 

Jun 10 2026 4:41 AM | Updated on Jun 10 2026 6:30 AM

Tamil Nadu CM Vijay Launches Singappen Force to Tackle Crimes Against Women

ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్‌ 

సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్‌ అనే ప్రత్యేక పోలీస్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్‌ మంగళవారం ఈ యూనిట్‌ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్‌ పెట్రోలింగ్‌ విధానాన్ని తీసుకువస్తామన్నారు. 

మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్‌ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్‌తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్‌ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్‌ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement