ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలేంటి..?

Tamil Nadu BJP Chief Fires On MK Stalin Says Platform Leader - Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కేబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ పార్టీపై చేసిన విమర్శలకు  రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్బంగా స్టాలిన్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ప్లాట్ఫారం స్పీకర్ లా మాట్లాడుతున్నారని అన్నారు. 

తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం ద్వారా తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. 

మాస్ వార్నింగ్..
మనీ లాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా ఈడీ వేధింపులకు గురిచేసినంత మాత్రాన మేము భయపడేది లేదు. మాక్కూడా రాజకీయాలు చేయడం తెలుసు. ఇది బెదింపు కాదు.. హెచ్చరిస్తున్నా.. " అంటూ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై తీవ్ర స్థాయిలో స్పందించారు. 

ఆ మాటలేంటి?
అన్నామలై మాట్లాడుతూ.. గౌరవనీయులైన స్టాలిన్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం తగదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఒక ప్లాట్ ఫారం స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. అదికూడా ఇప్పటివరకు ఐదు పార్టీలు మారి అనేక అక్రమాలకు పాల్పడిన అవినీతిపరుడిని కాపాడటానికి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. 

ఒకప్పుడు స్వయంగా మీరే ఈ బాలాజీ అవినీతిపరుడని ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరే ఆయన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, 8.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అనవసర భయాందోళనలను పక్కనపెట్టి కాస్త విచక్షణతో మాట్లాడమని ఈ సందర్భంగా  హితవు పలికారు.      

ఇది కూడా చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..         

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top