స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో 50శాతం మించకూడదని తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల అంశంలో కోర్టు ఉత్తర్వును అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని సుప్రీంకోర్టు అసహానం వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల అంశంపై సుప్రీంకోర్టు ఎట్టిపరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించకూడదని జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలెప్పుడూ చట్టానికనుగుణంగానే జరగాలనే అయితే రిజర్వేషన్ల పరిధి 50 శాతం మించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని కోర్టు తెలిపింది. స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల పరిమితి అంశాన్ని అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని కోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా రిజర్వేషన్ల పరిమితి 50శాతం దాటకూడదని లేదని తెలిపింది.
బాంథియా కమిషన్ నివేదికకు ముందు ఉన్న రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని మే 6న ఆదేశించిన విషయం ఈ సందర్భంగా సుప్రీం కోర్టు గుర్తు చేసింది. కాగా లోకల్ బాడీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం తెలంగాణలోనూ హాట్ టాఫిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.


