‘ధిక్కారం’పై కేసు వాపసుకు సుప్రీం అనుమతి

Supreme Court Allows Arun Shourie To Withdraw Plea on Contempt Law - Sakshi

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతిచ్చింది. ఇదే అంశంపై ఇప్పటికే పలు ఇతర పిటిషన్‌లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు వీరు సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. (ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా)

జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్‌ ఈ అంశంపై గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిపి పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. నేరపూరిత ధిక్కరణ విషయంలోని ఓ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు, సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. (రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top