Sukesh Chandrasekhar Writes To Lt Governor Of Delhi On Threatening Calls - Sakshi
Sakshi News home page

Sukesh Chandrasekhar: జైలులో నన్ను చంపాలని ప్లాన్‌ చేశారు.. సుఖేష్‌ సంచలన లేఖ

Jul 9 2023 4:29 PM | Updated on Jul 9 2023 6:06 PM

Sukesh Chandrasekhar Writes To Lt Governor Of Delhi On Threatening Calls - Sakshi

సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సెనాకు లేఖ రాశారు. ఈ లేఖలో తనకి జైలులో రక్షణ లేదని.. తనని మరో జైలుకు బదిలీ చేయాలని పేర్కొన్నాడు. దీంతో, సుఖేష్‌ లేఖ హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. మండోలి జైలు నుంచి చంద్రశేఖర్‌.. లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ లేఖలో జూలై 1న తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక, లేఖలో ‘నా లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతున్నా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నేను చేసిన ఫిర్యాదులను, స్టేట్‌మెంట్లను వెనక్కి తీసుకోవాలి.. లేదంటే జైల్లో ఉన్న నన్ను ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారు. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాల్ చేసిన వ్యక్తి కేజ్రీవాల్‌తో పాటు సత్యేంద్రజైన్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారు. జూన్ 23న మా తల్లికి కూడా ఇటువంటి బెదిరింపు కాల్ వచ్చింది. 

ఢిల్లీ మాజీమంత్రి సత్యేంద్రజైన్ సతీమణి సైతం మా అమ్మకు ఫోన్ చేసింది. నేను చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరించింది. నన్ను జైల్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు బెదిరిస్తున్నారు. మండోలి జైలులో నాకు భద్రత లేదు. దయచేసి నన్ను ఢిల్లీ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయండి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో రాష్ట్రంలోని జైలుకు నన్ను పంపించండి అని వేడుకుంటున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 

ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement