చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం.. ఆ సైట్లకు బానిసై అఘాయిత్యం

SP Isha Pant Responds on Kalaburagi Minor Girl Dead - Sakshi

సాక్షి, బెంగళూరు(బనశంకరి): చేతిలో మొబైల్‌ఫోన్, అందులో ఇంటర్నెట్, దీనివల్ల దుర్వినియోగం కూడా జరుగుతోంది. తెలిసీతెలియని బాలలు అశ్లీల చిత్రాలు చూసి నేరాల వైపు చూస్తున్నారు. కలబుర్గి జిల్లా ఆళంద శివార్లలో కోరళ్లిలో మంగళవారం  చెరుకు తోటలో మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య తీవ్ర సంచలనం సృష్టించగా, ఈ కేసులో మైనర్‌ బాలున్ని అఫ్జలపుర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ 16 ఏళ్ల బాలుడు ఐటీఐ విద్యార్థి. ఇతను ఎవరితో కలవకుండా నిత్యం ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ మొబైల్లో అశ్లీల చిత్రాలను చూసేవాడని ఫిర్యాదులున్నాయి. దీంతో అశ్లీల వీడియోల వ్యామోహంలో పడి ఈ నీచ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.  

ఎలా జరిగింది  
జిల్లా ఎస్‌పీ ఇశా పంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు కోరళ్లిలో నివాసముంటాడు. మొబైల్‌లో పోర్న్‌ వీక్షణకు బానిసయ్యాడు. ఘటనా సమయంలో బాలిక బహిర్బూమి కి వెళ్లడం చూసి బాలుడు వెంబడించాడు. అతన్ని చూసి బాలిక పరుగులు తీసినప్పటికీ వెంటాడి చెరుకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి రాయితో దాడి చేసి బాలికను హత్య చేశాడు.  

చదవండి: (Bengaluru: చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం, హత్య?)

ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలి, మొబైల్‌పై నిఘా ముఖ్యం  
ఘటన చోటుచేసుకున్న 24 గంటల్లోగా ఆళంద పోలీసులు గాలించి బాలుడిని అరెస్ట్‌ చేశారు. కేసును ఛేదించిన సిబ్బందికి రూ. లక్ష బహుమానాన్ని ప్రకటించారు. పదిరోజుల్లోగా చార్జిషీట్‌ వేస్తారని ఎస్‌పీ తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించాలని, పిల్లలు మొబైల్‌ను దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఆమె సూచించారు. ఈ రెండు విషయాలపై జాగృతి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top