వీడియో: ఇదెక్కడి ‘షాట్‌’.. డబుల్‌ మీనింగ్‌ యాడ్స్‌పై దుమారం

Shot Body Spray Ads Causes Outrage Over Promoting Rape Culture - Sakshi

వైరల్‌.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్‌’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా క్రియేటివిటీ పేరిట ఓ బాడీ స్ప్రే  కంపెనీ రూపొందించిన యాడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్‌, డియోడ్రంట్‌, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్‌.. తాజాగా రెండు యాడ్స్‌ను రూపొందించింది. ఈ రెండూ కూడా డబుల్‌ మీనింగ్‌ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, పైగా అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా ఉందనేది చాలామంది వాదన. షాపింగ్‌మాల్‌లో కొందరు స్నేహితులు-ఓ యువతి, గదిలో ఉన్న ఓ యువజంట‌- అతని స్నేహితుల మధ్య జరిగే సంభాషణల ఆధారంగా ఈ యాడ్స్‌ను రూపొందించారు.

ఈ రెండు యాడ్స్‌ మెయిన్‌ థీమ్‌ కూడా ‘షాట్‌’ను ప్రమోట్‌ చేసేదే!. అయితే ప్రమోషన్‌ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక డర్టీ ఆలోచనతో ఉందంటూ మండిపడుతున్నారు చాలామంది. ఈ యాడ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.  

ఈ వాణిజ్య ప్రకటన చిన్నవిషయం మాత్రమే కాదు, చాలా మంది మహిళలు రోజూ ఎదుర్కొనే భయాన్ని కూడా తమ స్వలాభం కోసం వాడుకుంటోందన్నది పలువురి వాదన. ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ యాడ్స్‌ను టెలికాస్ట్‌ చేసింది. 

నోటీసులు
అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI).. సోషల్‌ మీడియాలో ఈ రెండు షాట్‌ యాడ్స్‌ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్‌లో తెలిపింది. లేయర్స్‌ షాట్‌ డియోడ్రంట్‌ బ్రాండ్‌.. గుజరాత్‌ అహ్మదాబాద్‌ అడ్జావిస్‌ వెంచర్‌ లిమిటెడ్‌కు చెందింది. దేవేంద్ర ఎన్‌ పటేల్‌ దీనిని స్థాపించినట్లు కంపెనీ ప్రొఫైల్‌లో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top