నాన్న వస్తాడని ఎదురుచూస్తోంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే!

She Waiting For Her Dad Says Wife Of Pilot Who Deceased Covid Tragedy - Sakshi

ఓ తల్లి భావోద్వేగం

హరిద్వార్‌: కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మనిషిని మాయదారి రోగానికి కోల్పోతే ఆ బాధను వర్ణించడం కష్టం. అలాంటి వారిలో కెప్టెన్‌ హరీష్‌ తివారి ఒకరు.. కరోనాతో పోరాడుతూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయారు. నాన్నపై పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆ కూతురు.. నాన్న వస్తాడనే ఆశతో ఎదురుచూస్తుంది.. కానీ నాన్న రాడన్న విషయం తెలిస్తే ఆ చిన్ని గుండె ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.

హరిద్వార్‌కు చెందిన హరీష్‌ తివారికి పైలట్‌ అవ్వాలని కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి విమానాలను నడపాలనే ఆకాంక్షతో ఏవియేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు కంప్లీట్‌ చేసి పైలట్‌ అయి కోరికను నెరవేర్చుకున్నారు. అలా 2016లో ఎయిర్‌ ఇండియాలో పైలట్‌గా జాయిన్‌ అయ్యారు. కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకొని కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత మృదుస్మిత దాస్‌ అనే యువతితో వివాహం జరిగింది. మరుసటి సంవత్సరమే వారి జీవితంలో మహాలక్ష్మి అడుగుపెట్టింది. అలా జీవితం హాయిగా సాగిపోతున్న దశలో కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది.

హరీష్‌ కుటుంబం మొత్తం కరోనా బారీన పడింది.. వారి కూతురు తప్ప. అయితే కుటుంబం కోలుకున్నా.. హరీష్‌ మాత్రం ఆ మహమ్మారితో పోరాడుతూ పది రోజుల క్రితం కన్నుమూశారు. ఆయన కరోనాతో మృతి చెందడం.. హరీష్‌ తల్లిదండ్రులు వృద్దులు కావడంతో అతని భార్య మృదుస్మిత అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఐదేళ్ల కూతురికి నాన్న చనిపోయిన విషయం తెలియకపోవడంతో ఆసుపత్రిలో ఉ‍న్న నాన్న ఏ రోజైనా ఇంటికి వస్తాడని ఆశగా ఎదురుచూస్తుంది. 

ఇదే విషయమై మృదుస్మిత దాస్‌ మాట్లాడుతూ.. '' పది రోజుల క్రితం నా భర్త కరోనాతో కన్నుమూశారు.. ఆయనకు జరగాల్సిన అంత్యక్రియలు నేనే దగ్గరుండి పూర్తి చేశాను. నా ఐదేళ్ల కూతురికి ఆయన కరోనా బారీన పడ్డారన్న విషయం తెలుసు.. ఆసుపత్రిలో ఇంకా ఎన్నిరోజులు ఉంటారమ్మ అని అడుగుతుంది.ఆయన లేరన్న విషయం తెలిస్తే నా కూతురి పరిస్థితి ఏమవుతుందో.. హరీష్‌ తల్లిదండ్రులు రిటైర్డ్‌ ఉద్యోగులు.. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది..'' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 

అయితే హరీష్‌ తివారి ఒక్కరే కాదు.. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియాలో పనిచేస్తున్న 17 మంది పైలట్లు ఏడాది వ్యవధిలోనే కరోనాతో కన్నుమూశారు. అందులో 13 మంది ఫిబ్రవరి 2021 నుంచి మహమ్మారికి బలవ్వడం దురదృష్టకరం.
చదవండి: అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’ 

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-06-2021
Jun 09, 2021, 13:44 IST
సాక్షి, హైదరాబాద్‌:  టీకా కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీకి నిర్ణయం తీసుకున్న...
09-06-2021
Jun 09, 2021, 13:42 IST
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...
09-06-2021
Jun 09, 2021, 12:13 IST
హాంకాంగ్‌ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్‌న్యూస్.  హాంకాంగ్‌ నగరంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన వారికి  ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్‌...
09-06-2021
Jun 09, 2021, 12:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం...
09-06-2021
Jun 09, 2021, 11:29 IST
జైపూర్‌: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు నిరుపయోగంగా...
09-06-2021
Jun 09, 2021, 10:05 IST
దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,75,04,126 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
09-06-2021
Jun 09, 2021, 09:34 IST
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్‌...
09-06-2021
Jun 09, 2021, 08:42 IST
ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్‌  లెవెల్స్‌ పడిపోతుండటం,...
09-06-2021
Jun 09, 2021, 08:34 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2–డీఆక్సీ–డీ గ్లూకోజ్‌ (2–డీజీ) సమర్థంగా పనిచేస్తుందని డీఆర్‌డీవోకు...
09-06-2021
Jun 09, 2021, 08:15 IST
న్యూఢిల్లీ: ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతాప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి గుర్తున్నారా? వారి కథ మళ్లీ...
09-06-2021
Jun 09, 2021, 07:40 IST
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ డిసెంబర్‌ నాటికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై కేంద్రం తన విధానాన్ని, రోడ్‌ మ్యాప్‌ను పార్లమెంట్‌లో...
09-06-2021
Jun 09, 2021, 06:56 IST
సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి వినియోగిస్తున్న ఐరిస్‌ సాంకేతికతతో కరోనా వ్యాపించే అవకాశం ఉందంటూ...
09-06-2021
Jun 09, 2021, 04:36 IST
బీజింగ్‌/ సిడ్నీ: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందన్న అనుమానాలు బలపడేలా రోజుకో కథనం...
08-06-2021
Jun 08, 2021, 18:50 IST
న్యూఢిల్లీ: ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన కోవిడ్‌ మహమ్మారి గత కొద్ది రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన...
08-06-2021
Jun 08, 2021, 16:26 IST
సాక్షి, పుణె: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా  వైరస్‌ మ్యుటేషన్‌ చెందడంతో కేసుల సంఖ్య...
08-06-2021
Jun 08, 2021, 13:48 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. ...
08-06-2021
Jun 08, 2021, 13:04 IST
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది తమ ఆదాయ వనరులను కోల్పోయారు. ముప్పై నాలుగేళ్ల అంబికకు కూడా 14 ఏళ్లుగా తన...
08-06-2021
Jun 08, 2021, 12:53 IST
ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రిలో కావాలనే "మాక్ డ్రిల్"  నిర్వహించిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. 
08-06-2021
Jun 08, 2021, 11:04 IST
వెబ్‌డెస్క్‌: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదని కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌...
08-06-2021
Jun 08, 2021, 10:30 IST
భారీ ఊరట.. లక్షకు దిగువన కొత్త కేసులు
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top