వాక్సిన్‌పై సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన

Serum Institute Announces key Information About Covid Vaccine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. 2021 ప్రతమార్థంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్ అండ్ మిలంద్‌ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తికి సిరమ్‌ శ్రీకారం చుట్టింది. ఒక్కో డోసు రూ.250 ఉండే విధంగా.. మధ్యతరగతివారికి మిలంద్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించనుంది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. (దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ)

ఇక భారత్‌ బయోటెక్‌ రూపిందిస్తున్న కోవాగ్జిన్‌ సైతం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ కోసం దేశంలోని 12 ప్రయోగ కేంద్రంల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతికి అదుపులోకి రాకపోవడంతో ప్రపంచ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీపై దృష్టిసారించాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఇప్పటికే మూడో విడత ప్రయోగ దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై అశలు పెట్టుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top