విక్టోరియా గౌరీకి భారీ ఊరట.. సుప్రీం జోక్యంతో జడ్జిగా ప్రమాణం

SC Dismisses Petition Lawyer Victoria Gowri Sworn in as Judge - Sakshi

జడ్జిగా గౌరి నియామకం సరైందే 

ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

మద్రాస్‌ హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా గౌరి ప్రమాణం 

సాక్షి, ఢిల్లీ: మద్రాస్‌ హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా లాయర్‌ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్‌ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే...
మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్‌ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top