రూ.300 కోట్ల శశికళ ఆస్తుల జప్తు?

Sasikala 300 Crore Worth Property Attached To IT - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బినామి నిరోధక విభాగం జప్తు చేసినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి. గతంలో శశికళ, కుటుంబం సభ్యుల మీద ఐటీ దాడులు సైతం హోరెత్తాయి. ఇందులో లభించిన ఆధారాల మేరకు 2003–2005లో ఓ సెల్‌ ఫోన్‌ సంస్థ ద్వారా బినామీ పేర్లతో అక్రమాస్తులను శశికళ గడించినట్టు ఆదాయ పన్ను విచారణలో తేలింది. ( శశికళ చేతిలోకే అన్నాడీఎంకే! )

చెన్నై శివార్లలో 200 ఎకరాల భూమితోపాటు 65 రకాల ఆస్తులను కొనుగోలు చేసినట్టు వెలుగు చూసినట్టుంది. వాటిని జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో జైలు జీవితం అనంతరం చిన్నమ్మ బస చేయడం కోసం పోయెస్‌ గార్డెన్‌ వేద నిలయంకు ఎదురుగా నిర్మిస్తున్న భవనం స్థలం కూడా ఉండడం గమనార్హం. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా తేల్చారు. ఈ జప్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top