ఎన్‌సీబీ నుంచి తిరిగి డీఆర్‌ఐకి సమీర్‌ వాంఖడే

Sameer Wankhede Returns To DRI Over NCB Tenure Compltes Delhi - Sakshi

న్యూఢిల్లీ: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబై జోనల్‌ డైరెక్టర్‌గా కొనసాగిన సమీర్‌ వాంఖడే తిరిగి మాతృసంస్థ అయిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారి అయిన సమీర్‌ వాంఖడే ఎన్‌సీబీ ముంబై విభాగం చీఫ్‌గా 2020 ఆగస్ట్‌ నుంచి కొనసాగుతున్నారు.

2021అక్టోబర్‌లో ముంబై తీరంలో క్రూయిజ్‌ నౌకలో సోదాలు జరిపి డ్రగ్స్‌ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ సహా కొందరిని అదుపులోకి తీసుకోవడంతో వాంఖడే పేరు మార్మోగింది. డిసెంబర్‌ 31వ తేదీతో ఎన్‌సీబీలో వాంఖడే పదవీ కాలం ముగిసింది. కేంద్రం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో తిరిగి వాంఖడే డీఆర్‌ఐకు వెళ్లిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top