డ్రగ్స్‌ కేసులో రియాకు షాక్‌ | Rhea Chakraborty Bail Rejected | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో రియాకు షాక్‌

Sep 12 2020 7:00 AM | Updated on Sep 12 2020 7:00 AM

Rhea Chakraborty Bail Rejected - Sakshi

ముంబై: నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ రియా చక్రవర్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రియాతోపాటు ఇదే కేసులు, ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వీరి పిటిషన్లపై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్‌ విచారణ చేపట్టారు.

తనను ఈ తప్పుడు కేసులో ఇరికించారని రియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌సీబీ విచారణ సమయంలో చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎన్‌సీబీ అధికారులు తనను ఈ కేసులో ఇరికించేలా బలవంతంగా ఒప్పించారని ఆరోపించారు. సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్న విషయం రియాకు, ఆమె సోదరుడు షోవిక్‌కు తెలుసుననీ, సుశాంత్‌ చెప్పిన మేరకు వారిద్దరూ డ్రగ్స్‌ కొనుగోలు, చెల్లింపులు చేసినందున ఈ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించాలని ఎన్‌సీబీ వాదించింది. సుశాంత్‌ సింగ్, రియా చెప్పిన విధంగానే సుశాంత్‌ పనిమనిషి దీపేశ్‌ సావంత్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేశాడనీ, ఈ విషయం అతడు కూడా అంగీకరించినట్లు ఎన్‌సీబీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement