Rekha Singh: భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్‌

Rekha Singh Joined In The Indian Army - Sakshi

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్‌ లోయలో 2020 జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్‌ దీపక్‌ సింగ్‌ భార్య రేఖా సింగ్‌ ఇండియన్‌ ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె లెఫ్టినెంట్‌ అయ్యారు. 

ఆర్మీకి సంబంధించిన శిక్షణని మే 28 నుంచి చెన్నైలో రేఖా సింగ్‌ తీసుకోనున్నారు. దీపక్‌ సింగ్‌కు  తన భార్య కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని బలమైన కోరిక ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. వారిద్దరికీ పెళ్లయిన ఏడాదిన్నరలోనే గల్వాన్‌ ఘర్షణల్లో దీపక్‌ సింగ్‌ వీర మరణం పొందడం రేఖను బాగా కుంగదీసింది. 

భర్త పోయిన దుఃఖం నుంచి కోలుకున్న ఆమె టీచర్‌ ఉద్యోగం వీడి తన భర్త కన్న కలల్ని సాకారం చేయడానికి ఆర్మీలో చేరారు. అది కూడా ఏమంత సులభంగా ఆమెకి రాలేదు. రెండు సార్లు ప్రయత్నించిన మీద లెఫ్టినెంట్‌ పదవి దక్కింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top