ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు | Woman Hospitalised With Rib Fractures After Rapido Bike Crash In Bengaluru, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు

Jul 7 2026 7:54 AM | Updated on Jul 7 2026 9:15 AM

Rapido Bike Taxi Incident

ర్యాపిడో ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో రైడర్‌ వేగంగా బైక్‌ నడపడంతో ప్రమాదవశాత్తూ కిందపడటంతో పక్కటెములు విరిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జూన్‌ 17న సానికృష్ణ (32) అనే యువతి బైరసంద్రలో ఇంటి నుంచి దొమ్మలూరుకు ర్యాపిడో బుక్‌ చేసుకుంది.

 బైక్‌ వేగంగా నడపొద్దని సానికృష్ణ సూచించింది. తనకు వాహనం ఎలా నడపాలో తెలుసంటూ డ్రైవర్‌ వాదించాడు. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కిందపడిన సానికృష్ణపై వెనుక వచ్చిన ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఎక్స్‌రేలో పక్కటెములు విరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ర్యాపిడో రైడర్, ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

- బెంగళూరు

 
      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement