
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): తెల్లవారితే నీతులు చెప్పే ప్రజాప్రతినిధులు వారు చేసే పనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణ రామనగరలో చోటుచేసుకున్న సంఘటన. రామనగర నగరసభ కౌన్సిలర్ ఒకరు విమర్శల పాలవుతున్నారు.
రెండు రోజుల క్రితం పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న కల్యాణ మండపంలో సదరు కౌన్సిలర్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా డ్యాన్సర్లను పిలిపించి అశ్లీల నృత్యాలు చేయించారు. డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. సదరు వీడియోలు జిల్లాలో వైరల్‌గా మారడంతో ప్రజల్లో విస్మయం వ్యక్తమైంది.