Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ |Ram is the inspiration in governance: Modi- Sakshi
Sakshi News home page

Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ

Published Sat, Jan 20 2024 5:04 AM | Last Updated on Sat, Jan 20 2024 8:02 AM

Ram Mandir Ayodhya: Light Shri Ram Jyoti at home on Jan 22 to celebrate Deepawali says PM Modi - Sakshi

షోలాపూర్‌/:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.

ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్‌ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు.

అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్‌ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్‌లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు.  

బోయింగ్‌ క్యాంపస్‌ ప్రారంభం
దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్‌ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు.

బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్‌ డిఫెన్స్, ఏరోస్పేస్‌ పార్క్‌ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్‌ నూతన గ్లోబల్‌ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్‌ తాజా నిదర్శనమన్నారు.

భారత్‌ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్‌ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2023ను ప్రారంభించారు. 2029 యూత్‌ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు.

మహిళలే వృద్ధి సారథులు
భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్‌ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్‌ ప్రకటించింది. పైలట్‌ శిక్షణకు మహిళలకు స్కాలర్‌íÙప్‌లు ఇస్తామని పేర్కొంది.

సిద్ధూ, అది సహజం!
‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్‌ క్యాంపస్‌ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్‌ తదితరులు చిరునవ్వులు చిందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement