ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్‌ ఉన్నతస్థాయి సమీక్ష

Rajnath Singh Meets Service Chiefs Over India-China Border Clash - Sakshi

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్‌ మాట్లాడనున్నారు. 

తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద యాంగ్‌త్సే సమీపంలో భారత్‌, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది.

ఇదీ చదవండి: భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో గట్టి కౌంటర్‌ పడేనా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top