అమేథీలో కాంగ్రెస్‌ 1981 ఫార్ములా? | Sakshi
Sakshi News home page

lok Sabha Election-2024: అమేథీలో కాంగ్రెస్‌ 1981 ఫార్ములా?

Published Sun, Apr 28 2024 11:34 AM

Rajiv Gandhi filed his Nomination in Amethi on day ticket

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.

1981లో కాంగ్రెస్‌ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది.  రాజీవ్‌ గాంధీని  యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్‌ గాంధీ తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్‌ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ  కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్‌ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి  ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement